: సెప్టెంబరు 1 అంటే సేమ్యా పరమాన్నము ! 2013 !

 

సెప్టెంబరు 1 అంటే సేమ్యా పరమాన్నము !!

సెప్టెంబరు 1 కి సేమ్యా పరమాన్నంకి !
ఏదో అవినాభావ సంబంధము ఉండేది.
ఆ రోజు అమ్మ సేమ్యా పరమాన్నము తప్పకుండా చేసేది !!

ఆ రోజు మానాన్నగారి పుట్టిన రోజు !!
( అది మావిజయ పుట్టినరోజు కూడా !!)

గత నాలుగు వారాలలో రెండు సార్లు ఫిలడెల్ఫియా - బాలాకిన్విడ్ లోని పొస్టు ఆఫీసు వెళ్ళినప్పుడు , వాషింగ్టన్ లో పొస్టు ఆఫీసు వెళ్ళినప్పుడు , మళ్ళీ మొన్న లాస్ అల్టోస్ లో మీరామోంటే మీద వున్న పోస్టు ఆఫీసు వెళ్ళినప్పుడు ఎదో మన సొంత ఆఫీసుకి వెళ్ళీనట్టుగా అనిపించేది. ఏ ఫోస్టు ఆఫీసు అయినా మన ఆఫీసు లాగానే అనిపిస్తుంది !!

ఈ పోస్టు ఆఫీసులు నాన్నగారిని గుర్తు తెప్పించే క్షణాలు !!

దీనికి కారణాలు మేము పెద్ద పోస్టు ఆఫీసుల దగ్గర పెద్ద పోస్టుమాస్టరు గారి క్వార్టర్సులో వుండడం , నాన్నగారు పొద్దున్న ఆరు ఆరున్నర గంటలకల్లా అపీసు వెళ్ళడం , అప్పుడే గూర్ఖాచేత తాళాలు తీయిస్తుంటే ఛూడడం , అప్పుడఫ్ఫుడు ప్రొద్దున్న పోస్టాఫీసులో సరిగ్గా ఎడున్నరగంటలకి అన్ని పోస్టుబాగ్‍ల లోనించి అన్నిరకాల ఉత్తరాలు , కార్డులు , కవర్లు , పేకెట్లు తీసి ఏడెనిమిది మంది వాటిని సార్టింగ్ చేస్తున్నప్పుడు వింతగా చూడడం, సాయంత్రము అమ్మ ' నాన్నగారు ఏమి చేస్తున్నారో చూసిరారా' అంటే పరుగెత్తి వెళ్ళి మళ్ళీ ఆఫీసులోకి దూరి నాన్నగారిని చూసిరావడం !!

ఈ పెద్ద పోస్టు ఆఫీసులలో అంటే కాకినాడ పోర్టు దగ్గరున్న ఆఫీసు, రాజమండ్రీలో గోదావరి రైలు స్టేషను దగ్గర వున్న ఆఫీసులోను, కర్నూలు పెద్దపొస్టు ఆఫీసులోనూ నాన్నగారి టేబుల్ మిగిలిన ఆఫీసు టేబుల్స్ కన్న ఒక అడుగు లేక రెండు అడుగులు ఎత్తుగా ఉండేటట్టు పేట్టేవారు. నేను సాయంత్రము వెళ్ళినఫ్ఫుడు అ ఎత్తుగా వున్న టెబుల్ మీద నాన్నగారి కి ఎదురుగా వున్న కుర్చీలో నిశ్శబ్దముగా కూర్చుని ఆఫీసు అంతా చూడడం ఆ కాలంలోని ఒక చిన్నపిల్లవాడి అనుభూతి. నాన్నగారి టేబుల్ ఒక ఆకుపచ్చని లెదర్ లాంటి గుడ్డతో కప్పబడిఉండడం , మళ్ళీ దానిమీద రాసుకోవడం కోసము ఇంకో చిన్న బల్ల ఉండడం ఇవన్నీ ఆ చిన్నపిల్లవాడికి " మా నాన్న గారిపై "గర్వం కలిగించిన విషయాలు !!.

నాన్నగారి కాలంనాటి గుర్తుల లో ఒకటి "భవాన్స్ జర్నల్" అని రెండువారాలకి ఒకసారి వచ్చే ఇంగ్లిషు పత్రిక . అది రాగానే దాంట్లో మున్షీ గారు రాసిన మహాభారతము అని సీరియల్ గా వచ్చే కథ చదవడము , అదే కాలంలో అంటే నేను థర్డుఫారం లో వున్నప్పుడు నాన్నగారు ఇచ్చిన రాజాజీ రాసిన మహాభారతం చదవడం ఇవన్నీ చిననాటి అనుభూతులు !.

సింప్లిసిటి , సిన్సిరిటి ,
అన్‍డ్ ద వానిటి ,
ప్యూరిటి జనరాసిటి
యు కెనాట్ ఎటైన్ దీజ్ ఇన్ ది యూనివర్సిటీ !! ... అన్నపాట,
( it is a a song goes like - " simplicity sincerity and the vanity , Purity genorosity you cannot attain these in the university.." etc)

ఇంకా శివానంద ఆశ్రమము నుంచి వచ్చే పత్రిక తప్ప నాన్నగారి మరో ప్రపంచము గురించి అంతగా గుర్తులేదు.

కాని ఈ మధ్య రమణ మహర్షి గారి - " in the woods of God realization" - అని మూడు పుస్తకాలు చూడడము ( వెల ఎనిమిది రూపాయలు , ప్రచరణ 1940 ? ) , అందులో నాన్నగారు పెన్సిలుతో important అని రాసిన paragraphs చదివినప్పుడు తెలిసింది నాన్నగారి ఆలోచనలగురించి !!

అవన్నీ ఇంకోసారి !!

ఈ సారికి ఈ సేమ్యాపరమాన్నంతో ముగిద్దాం !!

PS : మేము ఏ డిగ్రీలు చేసినా, నాన్నగారి మద్రాసు పచ్చయప్ప కాలేజి 1920's లో బి ఏ డిగ్రీ, మా డిగ్రీ ల కన్న కన్నా ఘనమేమో అనిపిస్తుంది !! .
|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||